ములుగు జిల్లా జే.డీ మల్లంపల్లి మండలంలోని ఆగ్రో రైతు సేవ సెంటర్ వద్ద యూరియా కోసం నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా రైతులు చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పుతుందని ఊహించి, సెంటర్ షేటర్ మూసేసి సెంటర్ నిర్వాహకులు వెళ్ళిపోయారు. దీంతో యూరియా కావాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. అంతకు ముందు అక్కడ యూరియా కోసం చెప్పులు లైన్ లో పెట్టీ రైతులు వేచి చూశారు.