రిషికొండ ఆదిత్య అపార్ట్మెంట్స్ వెనుక ఉన్న భవనం పైనుంచి జారిపడి భవన నిర్మాణ కార్మికురాలు చందక సత్యాలు మృతి చెందిన సంఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు