తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలోని నిడిగల్లు-వెంకటగిరి రైల్వే స్టేషన్ మధ్య ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని శుక్రవారం రైల్వే డ్యూటీ కి మాన్ కిస్తాతయ్య గుర్తించారు. వెంటనే సమాచారాన్ని ఆర్ పి హెచ్ సి కె శ్రీనివాస్ రావు కు సమాచారం అందించారు. సుమారు 40-45 ఏళ్ల వయసు గల మగ వ్యక్తి రైలు నుండి జారి తీవ్ర గాయాలై మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అతని పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. ఆ మేరకు విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.