మంత్రి లోకేశ్ చొరవతో నేపాల్ చిక్కుకుపోయిన తెలుగు వారు తిరిగి ప్రయాణం: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ కు శుక్రవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. స్తానిక విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని తిరిగి రప్పించడంలో మంత్రి నారా లోకేశ్ చేసిన కృషిని ప్రశంసించారు. జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని, మెడికల్ కాలేజీలపై ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమని రవీంద్ర విమర్శించారు.