ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉట్నూర్ నుండి 70 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ కు వెళుతున్న ఆర్టీసీ బస్సు గుడిహత్నూర్ మండలం పూనగూడ వద్ద ఆకస్మికంగా చెట్టు బస్సుపై విరిగి పడింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ రామ స్వామి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సురక్షితంగా కాపాడాడు. దింతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో బస్సు అద్దాలు ద్వంసం కాగా, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.