రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… రాయచోటి పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ క్రమంలో 18 మండలాల ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయచోటి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తున్నామని చెప్పారు.సంవత్సరంలోపే క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.