ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు డ్రైవర్లు సెల్ఫోన్లను డిపోలలోనే డిపాజిట్ చేయాలని డ్యూటీ అయిపోయాక తీసుకోవాలని వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ నమ్రత తెలిపారు. మంగళవారం వికారాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు సెల్ఫోన్లను సెక్యూరిటీ వద్దడిపాజిట్ చేశారు. డ్రైవర్లు డ్రైవింగ్లో సెల్ఫోన్ చేయవద్దని పైలెట్ ప్రాజెక్టు కింద వికారాబాద్ డిపోలోనే ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజల భద్రత ఉద్యోగుల భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.