చిప్పగిరి మండలం వైసీపీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు రేణుక ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం రేణుక మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వారన్నారు.