2026 జనవరి లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీని పూర్తిస్థాయిలో భూస్థాపితం చేయాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్ పిలుపునిచ్చారు. అయినవిల్లి మండలం నేదునూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి వైసీపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాలన్నారు.