ఆదోని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై పీడీఎస్యూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మెడికల్ కాలేజీ రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ ఆపాలని, PPP విధానాన్ని రద్దు చేయాలని, వెంటనే తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘం నాయకులను, విద్యార్థులను పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. ప్రైవేటీకరణ రద్దుకు రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు.