ప్రకాశం జిల్లా రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సోమవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి అందులో విజయం సాధించిన ఉపాధ్యాయులకు విద్యార్థులు బహుమతులు అందజేశారు. తర్వాత ఉపాధ్యాయులతో కేక్ కట్ చేపించారు. ఉపాధ్యాయులను సన్మానిస్తూ వారి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇంత మంచి ఉపాధ్యాయులు వద్ద చక్కగా విద్యను అభ్యసించడంతోపాటు వారి ప్రేమను పొందడం తమ అదృష్టమని విద్యార్థులు అన్నారు.