గణేష్ నిమజ్జన శోభయాత్రలో విగ్రహాలను తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సం ఎదురైన సమస్యలను గుర్తించి అవి పునరావృత్తం కాకుండా పటిష్టబందోబస్తుకు ఎస్పీ అఖిల్ మహాజన్ చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ సబ్ డివిజన్ పరిధిలో 7వ రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సంవత్సరం బైక్ పెట్రోలింగ్తో పాటు పెన్ గంగ నదిలో డీడీఆర్ఎఫ్ బృందంతో పాటు బోట్ను అందుబాటులో ఉంచనున్నారు.