నరసన్నపేట కళాశాల రహదారిలోని హనుమాన్ మొబైల్ షాపులో మంగళవారం రాత్రి చోరీ జరిగినట్లు షాప్ యజమాని వైశ్య రాజు కేశవరాజు తెలిపారు. బుధవారం ఉదయం షాప్ చూడగా తాళాలు విరగగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. షాప్ కౌంటర్లోని సుమారు రూ. 10 వేలు అపహరణకు గురైందన్నారు. మరిన్ని వివరాలా తెలియాల్సి ఉంది.