This browser does not support the video element.
జిల్లాలో సెప్టెంబర్ నాటికి అన్ని సంక్షేమ హాస్టళ్లకు మరుగుదొడ్లు జిల్లా కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్
Vizianagaram Urban, Vizianagaram | Aug 28, 2025
జిల్లాలోని అన్ని రకాల సంక్షేమ వసతిగృహాలకు సెప్టెంబరు నాటికి మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ ఆదేశించారు. RWS, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తమ ఛాంబర్‌లో గురువారం 4 pm సమావేశమై,హాస్టళ్లలోని మరుగుదొడ్ల సౌకర్యంపై సమీక్షించారు. అక్కడి వసతులను,ప్రతిపాదనలను తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా హాస్టళ్లకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా 15 సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్లలో మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు.