స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో MON-SOON - HYGIENE అనే కార్యక్రము నిర్వహించారు. పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులలో ఉన్న మురికి కాలువలలో ఆయిల్ బాల్స్ వేసి మలాథియన్ స్ప్రేయింగ్ చేయించారు. పట్టణ వీధులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో, షార్ రోడ్డులో విద్యార్థులుచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య మాట్లాడుతూ వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, వార్డు