పల్నాడు జిల్లా,సత్తెనపల్లి సబ్ జైలులో మంగళవారం ఓ ఖైదీ ఆత్మహత్యకు యత్నించాడు. రాజుపాలెం మండలం అనుపాలెంకి చెందిన గోపికృష్ణ పలు దొంగతనాల కేసుల్లో సత్తనపల్లి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ ఉండగా మనస్థాపంతో పదునైన టైల్స్ రాయితో ఖైదీ గోపికృష్ణ చేయి కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి అనంతరం సబ్ జైలుకు తరలించారు.