ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం లో సిపిఎం నాయకులు ఏచూరి సీతారాంకు ఆదివారం నివాళులు అర్పించారు. సీతారాం వర్ధంతి పురస్కరించుకొని సిపిఎం నాయకులు ఆంజనేయులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లౌకిక వాదానికి రాజ్యాంగ పరిరక్షణ, మతసామరస్యానికి ఏచూరి సీతారాం ఎంతో కృషి చేసినట్లుగా ఆంజనేయులు కొనియాడారు. ఆయన అడుగుజాడలే మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలతో పాటు సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.