ప్రకాశం జిల్లా తాళ్లూరు ముండ్లమూరు మండలాలను మార్కాపురం జిల్లాలో కాకుండా ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఎంపీపీ శ్రీనివాసరావు కలెక్టర్ తమిమ్ అన్సారియా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తళ్ళూరు ముండ్లమూరు మండలాలను ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని కలెక్టర్ కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.