మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని రజక సంఘం ఆద్వర్యంలో బుధవారం ఉదయం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరు చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అంటూ ఆమె వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో దొరలు, దేశ్ముఖ్ల, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన వీర వనిత ఐలమ్మ అని పేర్కొన్నారు.