కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయ అర్చకులు విశ్వక్సేన ఆరాధన, అగ్ని ప్రతిష్ట,పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలను వేదమంత్రాలతో శ్రాస్రోత్తంగా జరిపించారు. దేవాలయంలో సోమవారం సాయంత్రం వార్షిక పవిత్ర ఉత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు తెలిపారు. దేవాలయానికి వచ్చే భక్తుల నుండి ఏ లోపమైన సంభవించినప్పుడు ఆ లోప నివారణ కొరకు ఈ పవిత్ర ఉత్సవాలను జరుపుతారన్నారు.