నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వినాయక నిమజ్జనంలో డమ్మీ తుపాకీతో డ్యాన్స్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 7న నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో భాగ్యనగర్ కాలనీకి చెందిన భక్తాంజనేయ గణేష్ మండలి విగ్రహం ఎదుట బుధవార్ పేట్ కు చెందిన పూదరి రంజిత్ తో పాటు మరికొందరు వ్యక్తులు డమ్మీ తుపాకితో డ్యాన్సులు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేసిన వినకుండా వారి విధులను అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పం