పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఎత్తిపోతల జలపాతం వర్షాలతో పుంజుకొని అద్భుతంగా కురుస్తుంది కొండలపై నుంచి దూకుతున్న జలదారులు అందాలను ఆస్వాదించేందుకు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సెలవులు కావడంతో కుటుంబాల సమేతంగా సందర్శకులు చేరి ఉత్సాహంగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు నాగార్జునసాగర్ డ్యాం దర్శనానికి వచ్చిన వారు కూడా ఇక్కడి జలపాతం అందాలను చూసి మురిసిపోతున్నారు.