యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో గుమ్మగట్ట మండలంలోని ఫర్టిలైజర్ షాపులను రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం తహసీల్దార్ రజాక్ వలి, మండల విద్యాశాఖ అధికారి నిర్మల్ కుమార్, ఎస్ఐ ఈశ్వరయ్య బృందం ఎరువులు, పురుగుమందుల దుఖానాలను తనిఖీచేసి రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించారు. యూరియా అక్రమంగా నిల్వ చేసినా, అనుమతికి మించి విక్రయాలు జరిపినా చట్టప్రకారం చర్యలు తప్పవని డీలర్లకు సూచించారు. యూరియా కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.