ఐటిఐ కళాశాల పురాతన భవనం పై కప్పుకు మరమ్మతులు చేయించాలి. సొంత భవనాల నిర్మాణం కొరకు నిధులు కేటాయించాలని, గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆలూరు ఐటిఐ కళాశాల నుండి విద్యార్థులతో ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు మండల అధ్యక్షుడు బసవరాజ్ అధ్యక్షత వహించారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ విజయ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మైన మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకముందే భవనం ఏర్పాటు చేయాలన్నారు.