సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని లాభాల బాట 20వేల రూపాయలు చెల్లించాలని కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ సమస్య పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను జేఏసీ నాయకులు కలిశారు శుక్రవారం ప్రజా భవన్లో వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు వారి సమస్య సాధన కోసం వెళ్లగా బట్టి విక్రమార్క కార్మిక సంఘ నాయకులతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై తెలియజేశారు సమస్యల సాధన కోసం అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడడం జరుగుతుందని బట్టి హామీ ఇచ్చినట్లు తెలిపారు.