ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్ పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను విస్మరించిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఐదు రూపాయలకే భోజనం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.