-జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అలెర్ట్ గా ఉండాలని ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ధర్మపురి గోదావరి నది తీరాన్ని పర్యటించారు. రాయపట్నం బ్రిడ్జి, నేరెళ్ల లో లెవెల్....