30 సంవత్సరాల క్రితం రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగుపడిన రోజుగా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మీడియాతో అన్నారు. సోమవారం మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొని మీడియాతో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మాట్లాడారు. సరిగా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు సీఎం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. దాదాపు 292 మంది పన్నూరు గ్రామస్తులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.