సూర్యాపేట జిల్లా: అర్హులైన పేదలందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తుంగతుర్తి మండలం వెంపటిలో ప్రజా సమస్యలపై సిపిఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడానికి సర్వే నిర్వహించామని తెలిపారు.