నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల HNSS పంప్ హౌస్ దగ్గర శనివారం జల హారతి కార్యక్రమంలో పాల్గొన్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల దశాబ్దాలనాటి కల సాకారమయింది,హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా కుప్పం బ్రాంచి కాలువకు కృష్ణానదీ జలాలు కుప్పం నియోజకవర్గంలోకి అడుగుపెట్టాయిఅన్నారు,భగీరథుడిలా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 14 నెలల కాలంలోనే హంద్రీనీవా కాలువలను ఆదునికీకరించి 730 కి. మీ. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కృష్ణా జలాలను పారించి, రైతాంగానికి సాగునీరు అందించి భరోసా కల్పించారుఅన్నారు.