కర్నూల్ నగరంలో అక్రమ మద్యాన్ని అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి ఒక స్కూటీని 472 మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ వెల్లడించారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కర్నూలు నగరంలోని బిర్లా గడ్డ దగ్గర కల బోయ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మద్యం అమ్మకాలు తన ఇంటి వద్ద జరుగుతుండగా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. కర్నూల్ లో వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఇంట్లో అక్రమంగా నిలువచేసి మద్యాన్ని విక్రయిస్తున్న సమాచారంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.