సిరికొండ మండలం చిమ్మనుడిలో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు నివాసాలలో గుడుంబాను గుర్తించినట్లు ఎస్సై పూజ తెలిపారు. పట్టుబడ్డ గుడుంబాను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సమాచార అందించాలని.. ఇన్ఫర్మేషన్ అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.