ఆటో డ్రైవర్లు పట్ల ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరించడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు అన్నారు. బుధవారం రణస్థలం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. 11న శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. డ్రైవర్లుకు PF, ESIలతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.