సఖినేటిపల్లి మండలం, టేకిశెట్టిపాలెం - అప్పన రాముని లంక వద్ద కాజ్ వే పైకి సోమవారం వరద నీరు చేరింది. కాజ్ వే పై మూడు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు మాట్లాడుతూ గత నెలలో కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని, మరలా ఇప్పుడు వరద పోటెత్తిందని వాపోయారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.