కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ పిఠాపురం వైసిపి ఇన్చార్జ్ వంగా గీత విశ్వనాథ్ నేతృత్వంలో అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మంగళవారం ఉదయం 11 గంటలకు మాట్లాడుతూ.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం ఎరువులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తుందని ఆమె మండిపడ్డారు. వైసిపి కార్యాలయం నుండి సాయంకాలం ఐదు గంటలకు ప్రకటనలో మీడియాకు తెలిపారు.