అయిజ పట్టణ బస్టాండ్ ఈ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే, అంతర్రాష్ట్ర బస్సులు కూడా వచ్చే ప్రధాన కేంద్రం. అయిజ మండలానికి అధిక పల్లెలు ఉండటంతో, ప్రతిరోజూ విద్యార్థులు చదువు కోసం, మహిళలు, వృద్ధులు వైద్యం కోసం, వ్యాపారులు తమ పనుల కోసం ఈ బస్టాండ్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారని అంత ప్రాధాన్యత ఉన్నా సదుపాయాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉందని,ప్రయాణికులు కూర్చోవడానికి అరా కోర కుర్చీలు ఉన్నప్పటికీ, ఎండ మరియు వర్షం పడితే రక్షణ కల్పించే షెడ్డు లేకపోవడం వల్ల వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు వర్షానికి తడుస్తూ, ఎండలకు ఎండుతూ ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు అన్నారు.