అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మజ్జి వలస హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆడేలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివాసి గిరిజన సంఘాల నేతలు స్థానిక గిరిజనులు ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జిల్లా ఎస్పీ కార్యాలయం చేరుకున్న వారు పలు సమస్యలతో కూడిన వెనతని జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందించారు. బాధిత గ్రామాల గిరిజనులు ఎస్పీ కార్యాలయానికి భారీగా చేరుకోవడంతో కొంతమందిని మాత్రమే అనుమతిస్తూ వినతులను స్వీకరించారు.