కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు వద్ద అతివేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి అదుపుతప్పి లారీని వెనుక భాగంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్లు స్థానికులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు,