పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజిద్దామని లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు తెలిపారు. లైన్స్ క్లబ్ జిల్లా పర్యావరణ చైర్మన్ రవికుమార్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు.. స్థానిక శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని రంగురంగుల వినాయకుల ప్రతిమలతో పర్యావరణానికి హానికరమని వారు పిలుపునిచ్చారు..