ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రానికి భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారులు ఆదివారం రూ.20 లక్షలకు పైగా విలువచేసే కియా 7 సీటర్ కారును విరాళంగా అందజేశారు. దేవస్థానం మనియార్ వీఎల్ఎన్ సౌమ్యనారాయణకు ఎస్బీఐ అధికారులు వాహన కీస్ను అందజేశారు. అనంతరం ఎస్బీఐ అధికారులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.