సోలార్ రైతుల భూముల పరిశీలనకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డిని అభ్యంతరకరంగా మాట్లాడిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బహిరంగ క్షమాపణ చెప్పాలని కేవీపీఎస్ కల్లూరు నగర నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కల్లూరులోని నాయకులు యేసురాజు ఏం.భాస్కర్ ఎస్ రోశయ్య ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడూతూ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధమని హెచ్చరించారు.