వినాయక విగ్రహ నిమజ్జన సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి అన్నారు. గురువారం వినాయక కమిటీ సభ్యులకు ఆయన తగు సూచనలు చేశారు. నిమజ్జన సమయాలలో డీజే, అసభ్యకర నృత్య ప్రదర్శనలు, అల్లర్లు సృష్టించే పాటలు పెట్టరాదన్నారు. పోలీస్ శాఖ వారు సూచించిన సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే వినాయక నిమజ్జనాలు నిర్వహించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.