చంద్రగ్రహణం కారణంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలను మూసివేశారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద గల మహాగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు ఓం ప్రకాష్ శర్మ ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ శుద్ధితో పాటు ఇతర పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు.