గుత్తి లోని మహర్షి దయానంద గురుకుల పాఠశాలలో శనివారం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్యం చేశారు. చిన్నారులు నృత్యానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు. తెలుగుతనం ఉట్టిపడే విధంగా నృత్యం చేశారు. అద్భుతంగా నృత్యం చేసిన చిన్నారులందరికీ పాఠశాల నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.