పెద్ద కడబూరు :మండలం కల్లుకుంట లోని సర్వే నంబర్ 174/1 భూమిలో నడుస్తున్న వివాదంపై ఎమ్మార్వో 145 సిఆర్పి ని విధించినట్లు ఎస్సై నిరంజన్రెడ్డి శనివారం తెలిపారు. అయితే తహశీల్దార్ విధించిన 145 సీఆర్పీసీని ఉల్లంఘిస్తూ సదరు భూమిని సాగు చేసుకుంటున్న 20 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తహశీల్దార్ గీతా ప్రియదర్శిని ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.