గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని భీమడోలులో సచివాలయ సిబ్బంది నిరసన వ్యక్తం చేసారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు స్థానిక ఎంపీడీఓ పద్మావతిదేవికి భీమడోలు మండల పరిధిలో పనిచేస్తున్న గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగ నిర్వహణలో ఎదురవుతున్న పలు సమస్యలు గురించి వివరించారు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది చేపట్టే ఆందోళనకు 15 రోజులు ముందస్తు నోటీసును అందించారు. కార్యక్రమంలో విలేజ్ వార్డ్ సచివాలయ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు బంటుమిల్లి కెనడీ ప్రసాద్, రత్న అంబేద్కర్, ,పి లక్ష్మి సుజన తదితరులు పాల్గొన్నారు