అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని పెద్దవడుగూరు మండల పోలీసులు అరెస్టు చేసినట్లు శుక్రవారం సాయంత్రం 7:30 సమయంలో తెలిపారు. మండలంలోని మిడుతూరు గ్రామంలో హనుమంతు అనే వ్యక్తి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు ఇవాళ సాయంత్రం రెండు గ్రామాలలో దాడులు చేసి నిందితుడి నుంచి 96 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.