తెలంగాణలో వరద ప్రాంతాలను చూసేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వార,ఏరియల్ సర్వేకు బయల్దేరారు. మొదటగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సుందిళ్ళ వద్ద ఉన్న హెలిప్యాడ్ కు చేరుకున్నారు. అంతకు ముందే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఉన్న వరద ప్రవాహాన్ని గగనతల మార్గం ద్వార పర్శిలించారు.అనంతరం రోడ్డు మార్గం ద్వార శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద చేరుకొని,గోదారమ్మకు చీర సారే ను సమర్పించారు. ఆ తర్వత ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్ట్ యొక్క వరద వివరాలతో పాటు ముంపు ప్రాంతాల వివరాలను తెలుసుకున్నారు.