జిల్లాలోని సిరికొండ మండలంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొండాపూర్ గ్రామ శివారులో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట, మొక్క జొన్న పంటలను పరిశీలించారు. దాదాపుగా 7, 8 ఎకరాలలో నష్టపోయిన పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు చిక్ మాన్ ప్రాజెక్ట్ నుండి వస్తున్న నీటి ప్రవహానికి గేటు లేకపోవడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరుతొందని, గేటు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అదేవిధంగా సిరికొండ మండలం ప్రాధమిక సహకార వ్యవసాయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ వివరాలు, ఈ పాస్ యంత్రం, నానో యూరియా సరఫరాపై ఆరా తీశారు.