స్వయం సహాయక సభ్యులు మరియు రైతు సంఘా సభ్యుల కు సుస్థిరమైన జీవనోపాధి,స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ నందు జిల్లా ప్రోజెక్టు మేనేజర్ వి.లక్ష్మ నాయక్, పి డి డిఆర్డీఏ. శైలజ,జిల్లా వ్యవసాయ వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ,పశుసంవర్ధక శాఖ జెడి,ఉద్యాన శాఖల అధికారుల తో కలసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కన్వర్జెన్స్ సమీక్ష సమావేశం నిర్వహించారు.